nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయి' టీజర్ రిలీజ్!

  • నాని తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • ఆకట్టుకుంటోన్న టీజర్ 
  • యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే కంటెంట్

నాని కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ కాల్స్ అబ్బాయి' సినిమా తెరకెక్కుతోంది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. నాని .. సాయిపల్లవి డైలాగ్స్ తో కూడిన సీన్స్ పై ఈ టీజర్ కట్ చేశారు.

నటన విషయంలో నాని .. సాయిపల్లవి పోటీ పడ్డారనే విషయం ఈ ఒక్క టీజర్ తోనే తెలిసిపోతోంది. ఈ ఇద్దరి సహజమైన నటనకు ఈ టీజర్ అద్దం పడుతోంది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమా వుంటుందనే విషయం అర్థమవుతోంది. 'ఫిదా' హిట్ తో వున్న సాయిపల్లవి .. 'నిన్నుకోరి' తో సక్సెస్ ను అందుకున్న నాని, ఈ సినిమాతో కలిసి మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. 

  • Loading...

More Telugu News