Nara Lokesh: అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదన్న ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం ఇదే!

  • ప్రతిపక్ష పాత్రను కూడా మేమే పోషిస్తాం
  • మంత్రులను ప్రశ్నలు అడగాలంటూ సభ్యులను చంద్రబాబు ఆదేశించారు
  • మీడియాతో చిట్ చాట్ సందర్భంగా లోకేష్ సమాధానం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అధికారపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభకు హాజరయ్యారు. సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో సభ ఖాళీగా కనపడుతోంది. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు... మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా 'సభలో ప్రతిపక్షమే లేదు కదా?' అనే ప్రశ్నకు లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తారని ఆయన అన్నారు. మంత్రులపై ప్రశ్నలు సంధించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. ఈ సందర్భంగా, పక్కనే ఉన్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, ప్రశ్నలను సంధించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చమత్కరించారు. 

Nara Lokesh
Telugudesam
ap assembly sessions
YSRCP
payyavula kesav
  • Loading...

More Telugu News