ramgopal varma: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డితో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడటంపై వివరం చెప్పిన రాంగోపాల్ వర్మ!

  • డబుల్ గేమ్ ఆడుతున్న ఎన్టీఆర్ ఆత్మ
  • కలలో కూడా అనుకోలేదు
  • ఇది కేతిరెడ్డి ఆడిస్తున్న ట్రిపుల్ గేమ్
  • వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ

ఎన్టీఆర్ ఆత్మ తన కలలోకి కూడా వచ్చి మాట్లాడుతోందని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "ఎన్టీఆర్ గారి ఆత్మ ఇలా నా మధ్య, కేతిరెడ్డి మధ్య డబుల్ గేమ్ ఆడుతోందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది ఒక మిమిక్రీ ఆర్టిస్టుతో రెడ్డి ఆడుతున్న ట్రిపుల్ గేమ్ అనే నిజంలో ఏ మాత్రం సందేహం లేదు" అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు.

కాగా, ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని లక్ష్మీ పార్వతి అంశంపై రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట, కేతిరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరిట చిత్రాలను నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ramgopal varma
ketireddy jagadeshwar reddy
lakshmi's ntr
lakshmi's veeragrandham
  • Error fetching data: Network response was not ok

More Telugu News