venu madhav: చంద్రబాబుపై బెంగొచ్చింది... చూసి, మాట్లాడి వెళుతున్నా: హాస్య నటుడు వేణుమాధవ్

  • మీడియాతో సరదాగా మాట్లాడిన వేణుమాధవ్
  • చంద్రబాబును చూసి చాలా రోజులైంది
  • కలిసి, మాట్లాడేందుకు వచ్చానన్న వేణుమాధవ్

నిన్న అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిన హాస్య నటుడు వేణుమాధవ్, ఆయన ఇంటి బయట తనను కలిసిన మీడియాతో సరదాగా మాట్లాడారు. అమరావతికి వచ్చి సీఎంను కలవాల్సిన కారణం ఏంటని ప్రశ్నిస్తే, "ఏం లేదు సార్... జనరల్ గా ఊరికే... చాలా రోజులైంది చూసి... బెంగవచ్చి... సీఎం గారిని చూశా, సీఎం గారితో మాట్లాడా. వెళుతున్నా" అని అన్నాడు.

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో వేణుమాధవ్ యాక్టివ్ గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వేణుమాధవ్ ప్రచారం నిర్వహించాడు. ఆపై కాకినాడలోనూ తళుక్కుమన్నాడు. 

venu madhav
amaravati
Chandrababu
  • Loading...

More Telugu News