vinayak: 'సాంబ' సినిమాలో ఆ సీన్ నేను తీసుండకూడదు .. ఇప్పటికీ బాధపడుతూనే ఉంటా : వినాయక్

  • 'సాంబ' సినిమాలో ఒక చెత్త సీన్ వుంది 
  • కెమెరా పెట్టి కూడా వద్దనుకుని తీసేశా
  • కానీ ఆ సీన్ తీయవలసి వచ్చింది 
  • ఎడిటింగ్ లోను తీసేయలేకపోయాను

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్ కి మంచి పేరుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని మిక్స్ చేసి ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఆయనకి బాగా తెలుసు. ప్రస్తుతం ఆయన సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

 "ఏ సినిమాలోనైనా సరే .. ఈ సీన్ ను నేను ఇలా తీశానేంటి? అని ఎప్పుడైనా ఫీలయ్యారా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు వినాయక్ స్పందిస్తూ .. "ఛ .. ఈ సీన్ నేను తీసుండకూడదు అని నేను ఫీలైన సినిమా మాత్రం 'సాంబ'. అందులో ఒక చెత్త సీన్ ఉంటుంది .. దాని గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీన్ తీయడం ఇష్టం లేక .. కెమెరా పెట్టి కూడా తీసేశా. బానే వుంది కదా .. ఏవైంది అంటూ కొంతమంది ఒత్తిడి చేయడంతో .. నా వలన షూటింగ్ ఆగిపోకూడదని చేశాను .. ఎడిటింగ్ లోను తీయలేకపోయాను. ఎప్పటికీ నాకు అదొక బాధే .. నేను ఆ సీన్ తీసుండకూడదనే అనుకుంటా" అంటూ చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News