ఎమ్మెల్యేలు డీకే అరుణ: ఎమ్మెల్యేలు డీకే అరుణ, భాస్కర్ రావుల ఆసక్తికర సంభాషణ!
- తెలంగాణ అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మధ్య సంభాషణ
- తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని భాస్కరరావుని కోరిన అరుణ
- టీఆర్ఎస్ లో సంతోషంగా ఉన్నానన్న భాస్కర్ రావు
తెలంగాణ అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావుల మధ్య ఈరోజు ఆసక్తికర సంభాషణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీఆర్ఎస్ లోకి వెళ్లిన భాస్కర్ రావును తిరిగి తమ పార్టీలోకి రావాలని డీకే అరుణ కోరడం జరిగింది. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది..
డీకే అరుణ: మీ కార్యకర్తలు మా పార్టీకి వస్తున్నారు!
భాస్కర్ రావు: వచ్చినా ఏం చేసుకుంటారు?
డీకే అరుణ: మీరు! ఏదో అనుకుని ఆ పార్టీలోకి వెళ్లారు, ఇప్పుడు బాధపడుతున్నారు.ఇక్కడికే మళ్లీ రండి
భాస్కర్ రావు : నేను ఏదో ఊహించుకుని ఆ పార్టీలోకి వెళ్లలేదు, నేను సంతోషంగా ఉన్నా