padmavathi: రాణి పద్మావతికి అవమానం జరగదు.. కీర్తి పెరుగుతుంది: సంజయ్ లీలా భన్సాలీ భరోసా

  • పద్మావతి సినిమాలో ఇంతవరకు వచ్చినవి పుకార్లే
  • అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమ సన్నివేశాలు లేవు
  • ఈ సినిమాతో పద్మావతి కీర్తి పెరుగుతుంది

'పద్మావతి' సినిమాతో రాణి 'పద్మావతి'కి ఎలాంటి అవమానం జరగదని ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. డిసెంబర్ 1న 'పద్మావతి' సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ ఎత్తున వివాదం చెలరేగుతున్న క్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాతో ఎవరి మనోభావాలు దెబ్బతినవని అన్నారు.

'పద్మావతి' సినిమాపై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలు, పుకార్లు, వక్రీకరణలేనని ఆయన తెలిపారు. తాను సినిమాను వివాదం కోసమో లేక ఎవరినో కించపరచాలనో తీయనని ఆయన స్పష్టం చేశారు. తాను 'పద్మావతి' గురించి తెలుసుకుని స్పూర్తి పొందానని ఆయన  చెప్పారు.

తమ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. తమ సినిమా రాణి 'పద్మావతి' కీర్తి పెంచుతుందే కానీ ఆమె ప్రతిష్ఠను దిగజార్చదని ఆయన భరోసా ఇచ్చారు. 

padmavathi
sunjay leela bhanshali
movie
controversy
explanation
  • Loading...

More Telugu News