karthi: తొలి సినిమా చేసినప్పుడు కథ ఏంటో కూడా తెలీదు: కార్తీ

  • యూఎస్ లో విద్యాభ్యాసం పూర్తైన తరువాత సినిమాల్లోకి వచ్చాను
  • తొలి సినిమా చేసినప్పుడు కథేంటో కూడా తెలియదు
  • అన్నయ్య ఏం చెప్పాడో అదే చేశాను

తొలి సినిమా చేసినప్పుడు కథ ఏంటో కూడా తనకు తెలియదని సినీ నటుడు కార్తీ తెలిపాడు. యూఎస్ లో విద్యాభ్యాసం పూర్తైన తరువాత సినిమాల్లో నటించాలని అన్నయ్య సూచించాడని కార్తీ తెలిపాడు. సినిమాల్లో ఫెయిల్ అయితే మరో కెరీర్ ఉండాలని ఉన్నత విద్యాభ్యాసం చేయించారని తెలిపాడు. 'దర్శకుడు మంచోడు, స్క్రిప్ట్ బాగుంది, నటించు' అని అన్నయ్య చెప్పాడని కార్తీ తెలిపాడు.

నటన రాదు కదా ఎలా? అని అడిగితే.. 'నేర్చుకోడానికి ట్రై చెయ్...నేర్చుకోవడం మొదలు పెడితే నటన వస్తుంది. డైరెక్టర్ ఏం చెబితే అది అలాగే చెయ్' అని అన్నయ్య సూచించాడని కార్తీ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ రెండేళ్లు నడిచిందని అన్నాడు. అన్నయ్య చెప్పినట్టే ఆ సినిమా సూపర్ హిట్ అయిందని అన్నాడు. ఏడాదిపాటు ఆడిందని, అవార్డులు కూడా వచ్చాయని గుర్తుచేసుకున్నాడు. ఆ తరువాతి సినిమా షూటింగ్ మూడేళ్ల పాటు జరిగిందని చెప్పాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిందని తెలిపాడు. 

  • Loading...

More Telugu News