Jaya TV: చెన్నైలో కలకలం.. జయలలిత టీవీ కార్యాలయంపై ఐటీ దాడులు

  • ఈ తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న తనిఖీలు
  • శశికళ మేనల్లుడు వివేక్ జయరామ్ నివాసంలోనూ సోదాలు
  • జాజ్ సినిమా కార్యాలయాలపైనా దాడులు

చెన్నైలోని జయ టీవీ కార్యాలయంపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఈ ఉదయం దాడులకు దిగారు. ఎక్కత్తుతంగల్‌లోని జయ టీవీ చానల్ కార్యాలయంలోకి నేటి తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్న పదిమంది ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆదాయపన్ను ఎగవేతకు సంబంధించి కచ్చితమైన సమాచారంతోనే తనిఖీలకు దిగినట్టు అధికారులు తెలిపారు. టీవీ చానల్, సీనియర్ అధికారుల కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

జయ టీవీని జయలలిత ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం ఇది ఇటీవల జైలుపాలైన అన్నాడీఎంకే నేత శశికళ కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంది. శశికళ మేనల్లుడు వివేక్ జయరామ్ ఇప్పుడు టీవీ బాధ్యతలను చూస్తున్నారు. ఆగస్టులో అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు చానల్ నిర్వహణ కష్టమైంది. కాగా, జయ టీవీ కార్యాలయంపై దాడులు నిర్వహించిన అధికారులు తర్వాత వివేక్ నివాసం, శశికళ కుటుంబ సభ్యులకు చెందిన జాజ్ సినిమా కార్యాలయాలపైనా దాడులు నిర్వహించారు.

Jaya TV
Jayalalitha
Sashikala
AIADMK
IT
  • Loading...

More Telugu News