విజయ్ దేవరకొండ: ట్రైనర్ వద్ద నా శరీరంతో ప్రయోగం చేస్తున్నా: హీరో విజయ్ దేవరకొండ
- ట్రైనర్ కులదీప్ వద్ద శిక్షణ పొందుతున్నా
- ఏం జరుగుతుందో చూద్దాం
- ‘ఫేస్ బుక్’లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ
- ‘అర్జున్ రెడ్డి’ సిక్స్ ప్యాక్ గా మారేందుకు అంగీకరించాడు: కులదీప్
‘అర్జున్ రెడ్డి’ చిత్రం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశాడు. ‘ట్రైనర్ కులదీప్ వద్ద శిక్షణ పొందుతున్నా. నా శరీరంతో ప్రయోగం చేస్తున్నా. ఈ ప్రయోగం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్న విజయ్ దేవర్ కొండ, ట్రైనర్ కులదీప్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.
కాగా, ఇదే విషయాన్ని ట్రైనర్ కులదీప్ ప్రస్తావిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘విజయ్ దేవరకొండ మరో ఛాలెంజ్ కు అంగీకరించాడు. ‘అర్జున్ రెడ్డి’ సిక్స్ ప్యాక్ గా మారేందుకు, 360 డిగ్రీస్ ఫిట్ నెస్ కు అంగీకరించాడు’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.