duddilla sridhar babu: మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు

  • గంజాయి కేసులో శ్రీధర్ బాబుపై కేసు
  • ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన శ్రీధర్ బాబు
  • బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే తనను గంజాయి కేసులో ఇరికించారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. కేసును విచారించిన హైకోర్టు... శ్రీధర్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 

duddilla sridhar babu
telangan congress
bail to sridhar babu
  • Loading...

More Telugu News