vijayanagaram: లేడీస్ టాయిలెట్ లో నీకేం పని? అన్నందుకు... ధియేటర్ సిబ్బంది దాడి!

  • పార్వతీపురంలోని సౌందర్య థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన కుటుంబం
  • సినిమా మధ్యలో టాయిలెట్ కు వెళ్లిన మహిళ
  • టాయిలెట్ లో మహిళ చెయ్యి లాగిన పారిశుద్ధ్య కార్మికుడు
  • నిలదీసిన మహిళ భర్తపై దాడి చేసిన థియేటర్ సిబ్బంది

లేడీస్ టాయిలెట్ లో నీకేం పని? అని విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సౌందర్య థియేటర్‌ సిబ్బందిని నిలదీసిన మహిళ, ఆమె భర్తపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి పార్వతీపురంలో సౌందర్య థియేటర్లో ఆడుతున్న 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చూసేందుకు వెళ్లారు.

సినిమా మధ్యలో చైతన్య భార్య టాయిలెట్‌ కు వెళ్లారు. అక్కడ పారిశుధ్య కార్మికుడు శుభ్రం చేసేందుకు ఉన్నాడు. లేడీస్ టాయిలెట్ లో నీకేం పని? అని ఆమె అడగడంతో ఆమె చెయ్యిపట్టుకుని లాగాడు. దీంతో ఆమె భయంతో బయటకు పరుగుతీసి, తన భర్తకు విషయం వివరించింది. దీంతో అతనిని నిలదీసేందుకు వెళ్లాడు. దీంతో థియేటర్ సిబ్బంది మొత్తం ఏకమై చైతన్యపై దాడికి దిగారు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

vijayanagaram
parvathipuram
soundarya theater
movie
lady
attack
  • Loading...

More Telugu News