ఎమ్మెల్యేలు భాస్కర్: తెలంగాణ ఎమ్మెల్యేలు భాస్కర్, వంశీచందర్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
- అసెంబ్లీ లాబీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి మధ్య సంభాషణ
- భాస్కర్ ని మళ్లీ ‘కాంగ్రెస్’లోకి రమ్మన్న వంశీ
- వంశీనే టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన భాస్కర్
తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, వంశీ చందర్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ‘కాంగ్రెస్’ నుంచి ఇటీవలే టీఆర్ఎస్ లోకి వెళ్లిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మధ్య సంభాషణ ఇలా సాగింది..
వంశీ చందర్ రెడ్డి : అన్నా, మళ్లీ మా పార్టీలోకొచ్చేయ్
భాస్కర్ రావు : అందరూ టీఆర్ఎస్ లోకి వచ్చే వాళ్లే. నువ్వే, మా పార్టీలోకి వచ్చెయ్. యంగ్ లీడర్ కేటీఆర్ టీమ్ లో నీకు మంచి అవకాశం ఉంటుంది.
వంశీ చందర్ రెడ్డి : నేను కారెక్కలేను. మీరే, మా పార్టీలోకి రావాలి