టీడీపీ నేత కళావెంకట్రావు: పాదయాత్ర చేస్తేనే సీఎం అవుతారంటే ఎవరైనా చేస్తారు!: టీడీపీ నేత కళావెంకట్రావు
- నేతకు నిబద్ధత..పార్టీకి పాలసీ అనేవి ఉండాలి
- జగన్ కు పదవీకాంక్ష తప్పా, ప్రజల సమస్యలు పట్టడం లేదు
- పాదయాత్ర చేస్తేనే సీఎం అవుతారంటే ఎవరైనా చేస్తారు: టీడీపీ నేత
ఏ నేతకైనా నిబద్ధత.. ఏ పార్టీకి అయినా పాలసీ అనేవి ఉండాలని, ఆ రెండూ జగన్ కు లేవని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై చర్చించే వేదిక అసెంబ్లీ అని, జగన్ కు పదవీ కాంక్ష తప్పా ప్రజల సమస్యలు పట్టడం లేదని, పాదయాత్ర చేస్తేనే సీఎం అవుతారంటే ఎవరైనా చేస్తారని అన్నారు. ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ప్రస్తావించారని..ఇందుకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని అన్నారు.