twitter: ట్వీట్‌లో 35 వేల పదాలు పోస్ట్ చేసిన జర్మన్ హ్యాకర్లు
- వారి ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేసిన ట్విట్టర్
- తప్పిదాన్ని సరిచేసిన కంపెనీ
- 280 పదాలను మాత్రమే అనుమతిస్తున్న ట్విట్టర్
ఇటీవల 140 పదాల ట్వీట్ పరిమితిని ట్విట్టర్ 280 పదాలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే 35 వేల పదాలు ఉపయోగించిన జర్మనీకి చెందిన ఇద్దరు హ్యాకర్లు టిమ్రాసెట్, హ్యాక్నీవైటీ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యూఆర్ఎల్ ఎంబేడింగ్ పద్ధతి ద్వారా అక్షరాలను ట్వీట్‌లో అమరేలా వీరు చేయగలిగారు.
ఈ హ్యాకింగ్‌కి పాల్పడినందుకు వారివురి ఖాతాలను ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసింది. వారు హ్యాక్ ఎలా చేయగలిగారో గ్రహించి తప్పిదాన్ని సరిచేసిన తర్వాత వారి ఖాతాలను పునరుద్ధరించినట్లు ట్విట్టర్ ప్రతినిధి తెలిపాడు. ప్రస్తుతం 280 పదాల ట్వీట్ పరిమితి 328 మిలియన్ల మంది యూజర్లకే అందుబాటులో ఉన్నదని, త్వరలోనే అంతర్జాతీయంగా 280 పదాల్లో ట్వీట్ చేసే సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చాడు.