rajanikanth: కన్నడ రాజకీయాల్లోకి సినీ నటి అమూల్య?

  • తమిళ రాజకీయాల్లోకి కమలహాసన్, రజనీకాంత్
  • ఏపీ రాజకీయాల్లోకి వాణీ విశ్వనాథ్
  • కన్నడ రాజకీయాల్లోకి ఉపేంద్ర, అమూల్య

దక్షిణాది చిత్ర ప్రముఖులు ఇప్పుడు రాజకీయ రంగంలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. తమిళనాట కమలహాసన్, రజనీకాంత్ కొత్త పార్టీలను పెట్టే ఆలోచనలో ఉండగా, ఏపీలో వాణీ విశ్వనాథ్ టీడీపీలో ప్రవేశించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇక కర్ణాటకలో ఉపేంద్ర కొత్త పార్టీని ప్రకటించగా, అదే పరిశ్రమకు చెందిన నటీమణి అమూల్య రాజకీయ రంగప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆమె బీజేపీ తరపున రాజకీయ అరంగేట్రం చేసే అవకాశముందని అక్కడి మీడియా పేర్కొంటోంది. అమూల్య భర్త జగదీశ్ సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారని తెలుస్తోంది. ఆమె మామ రామచంద్ర బెంగలూరులోని రాజరాజేశ్వరి నగర్ బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.

 ఈ నేపథ్యంలో తన భర్త సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విశేషాలను ఆమె విరివిగా పోస్టు చేయడం వెనుక కారణం... రాజరాజేశ్వరి నగర్ నుంచి పోటీకి దిగేందుకు ప్రయత్నమేనని స్థానిక రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‌ఈ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌ గౌడ పోటీకి దిగనున్నాడన్న ప్రచారం నేపథ్యంలో బలమైన అభ్యర్థిని నిలపాలని బీజేపీ భావిస్తోంది.

ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నం జేడీఎస్‌లోకి ఫిరాయించే అవకాశం కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలంటే అమూల్యను బరిలో దింపాల్సిందేనని బీజేపీ భావిస్తోందని, ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ అరంగేట్రం ఖాయమని వారు పేర్కొంటున్నారు.

rajanikanth
Kamal Haasan
upendra
vani viswanath
amulya
politics
  • Loading...

More Telugu News