Hyderabad: హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

  • హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం కలకలం
  • ఫిజిక్స్ విభాగంలో విద్యనభ్యసిస్తున్న బీర్బల్ 
  • ఎల్ హాస్టల్ రెండో అంతస్తు నుంచి దూకేసిన బీర్బల్

రోహిత్ వేముల ఆత్మహత్యాయత్నం హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా అదే యూనివర్సిటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడం యూనివర్సిటీలో తీవ్ర ఆందోళన రేపింది. ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో విద్యనభ్యసిస్తున్న బీర్బల్ అనే విద్యార్థి ఎల్ హాస్టల్ భవనం రెండో అంతస్తుపైకెక్కి అక్కడి నుంచి కిందికి దూకేశాడు. దీనిని చూసిన సహవిద్యార్థులు హుటాహుటీన అతనిని గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా బీర్బల్ డిప్రెషన్ లో ఉన్నాడని స్నేహితులు చెబుతున్నారు. 

Hyderabad
central university
sucide attempt
  • Loading...

More Telugu News