Nirmala Sitharaman: అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన నిర్మలా సీతారామన్.. చైనా అగ్గిమీద గుగ్గిలం!

  • ఇరు దేశాల మధ్య శాంతికి విఘాతం కలుగుతుందని ఆందోళన
  • అదో వివాదాస్పద ప్రాంతమని వ్యాఖ్య
  • గతంలో దలైలామా పర్యటనలోనూ అభ్యంతరాలు

భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆమె పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించింది. వివాదాస్పద ప్రాంతంలో ఆమె పర్యటించడం వల్ల శాంతికి విఘాతం ఏర్పడే అవకాశం ఉందని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఉన్న సైనిక స్థావరాలను ఆదివారం మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. బలగాల సన్నద్ధతను తెలుకున్నారు. ఆమె పర్యటనపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునింగ్ మాట్లాడుతూ.. అరుణాచల్‌ప్రదేశ్ ఓ వివాదాస్పద భూభాగమని పేర్కొన్నారు. అక్కడ చైనా స్థానమేంటో భారత్ స్పష్టంగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇదో వివాదాస్పద ప్రాంతమని, ఇక్కడ పర్యటించడం తగదని హితవు పలికారు. ఇటీవల బౌద్ధ మతగురువు దలైలామా పర్యటించినప్పుడు కూడా చైనా ఇటువంటి అభ్యంతరాలనే వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News