స్వాతి సోమనాథ్: ఆ నృత్యరూపకం సంగతి మా అమ్మకు తెలిసి నన్ను తిట్టింది: స్వాతి సోమనాథ్

  • ‘కామసూత్ర’ నృత్య రూపకం విషయం తెలిసి మా అమ్మ మండిపడింది
  • ‘నీకేమైనా బుద్ధి ఉందా! ఎవరు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగింది
  • నాటి విషయాలను ప్రస్తావించిన స్వాతి సోమనాథ్

‘కామసూత్ర’ నృత్య రూపకం సంగతి చెబితే నాడు తన తల్లి తనను తిట్టిన విషయాన్ని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రస్తావించారు. ‘తెలుగు పాప్యులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘సాధారణంగా ఏదైనా కొత్త నృత్యరూపకం చేయదలచుకున్నప్పుడు మా అమ్మకు చెబుతాను. అయితే, ‘కామసూత్ర’ నృత్యరూపకం చేయదలచుకున్నప్పుడు మాత్రం ఈ విషయాన్ని అమ్మకు చెప్పలేదు. ఏదో కొత్త నృత్యరూపకం చేస్తున్నట్టు అమ్మకు తెలుసు కానీ, ‘కామసూత్ర’  అని తెలియదు.

ఆ తర్వాత ఈ నృత్యరూపకం గురించి ఓరోజు నేను ఫోన్ లో మాట్లాడుతుంటే.. అప్పుడు మా అమ్మ అడిగితే, స్క్రిప్ట్ టేబుల్ మీద పెట్టాను..ఆశ్చర్యపోయింది. ఈ నృత్యరూపకం చేసేందుకు వీలు లేదని చెప్పింది. ‘నీకు పెళ్లి కాలేదు. ‘కామసూత్ర’ చేసిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీకేమైనా బుద్ధి ఉందా?..’ అని మా అమ్మ కసురుకుంది. ‘నాకు పెళ్లయినా, కాకపోయినా.. వచ్చే వాడేమనుకున్నా సరే, నువ్వు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఈ నృత్యరూపకం చేస్తా’ అని అప్పుడు అమ్మకు చెప్పాను. అమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఓ రోజున ఈ విషయం మా బ్రదర్ కి అమ్మ చెప్పింది. ‘ఏం ఫర్వాలేదు, చెయ్యనీ..తప్పేముంది?’ అని అన్నాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News