hdfc: ఖాతాదారుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త.. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ రుసుములు రద్దు!

  • నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రుసుములు రద్దు
  • చెక్‌ బుక్‌ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరిస్తూ నిర్ణ‌యం
  • ఈ నెల 1 నుంచి ఆదేశాలు అమ‌ల్లోకి  

న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హిస్తూ ప్రైవేటు రంగ దిగ్గ‌జ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త చెప్పింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రుసుముల‌ను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాదు, చెక్‌ బుక్‌ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ఖాతాదారులు ఇక‌ నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌ల‌ను ఉచితంగా జ‌రుపుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ నెల 1 నుంచి ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు పేర్కొంది. త‌మ బ్యాంకులో సేవింగ్‌, శాలరీ అకౌంట్లు ఉన్న వారంద‌రికీ ఇవి వర్తిస్తాయని ప్ర‌క‌ట‌న చేసింది.

అలాగే, చెక్  ఆధారిత లావాదేవీలు, రికవరీ స‌వ‌ర‌ణ‌ ఛార్జీలను వ‌చ్చేనెల 1 నుంచి అమలు చేస్తామని పేర్కొంది. గతంలో రెండు లక్షల లోపు ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలు జ‌రిపితే రూ.25 రుసుం వ‌సూలు చేసేది. ఇక 2 నుంచి 5 లక్షలపై రూ.50 విధించేది. అలాగే నెఫ్ట్‌ లావాదేవీలపై పది వేల లోపు అయితే రూ.2.50, లక్ష దాటిన‌ లావాదేవీలపై రూ. 5 నుంచి రూ.15 వ‌ర‌కు వ‌సూలు చేసేది.  

  • Loading...

More Telugu News