achennaidu: పాదయాత్ర ముగిసే సమయానికి జగన్ వెంట ఐదుగురే ఉంటారు: అచ్చెన్నాయుడు

  • పాదయాత్రతో టీడీపీకి నష్టం లేదు
  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరికాదు
  • జగన్ వెంట ఎవరూ ఉండరు

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రతో టీడీపీకి ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి, పాదయాత్ర చేయడం హర్షించదగ్గ విషయం కాదని చెప్పారు.

 పాదయాత్ర ముగిసే సరికి జగన్ వెంట ఎవరూ ఉండరని... ఆయన కుటుంబసభ్యులతో పాటు మరో ఐదుగురు సభ్యులు మాత్రమే వైసీపీలో మిగులుతారని అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ కాకుండా 1100 కాల్ సెంటర్ ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందని ఎద్దేవా చేశారు.

achennaidu
jagan
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News