raviteja: రవితేజ ఇలా చేస్తాడని ఊహించలేదు: తమిళ దర్శకుడి ఆవేదన

  • 'రాజా ది గ్రేట్' తో సక్సెస్ వరించింది   
  • వరుస సినిమాలు అంగీకరిస్తున్న వైనం 
  • 'భోగన్' రీమేక్ లో నటించేందుకు మొదట్లో అంగీకారం 
  • ఈ సినిమా నుంచి అకస్మాత్తుగా వైదొలగిన రవితేజ

సుదీర్ఘ విరామం తరువాత టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ 'రాజా ది గ్రేట్' సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతో ర‌వితేజ వ‌రుస సినిమాలు అంగీక‌రిస్తున్నాడు. అలా అంగీకరించిన సినిమాల్లో త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `బోగ‌న్‌` సినిమా ఒకటి. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించేందుకు అంగీకరించిన ఈ మాస్ మహరాజా అకస్మాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

దీనిపై ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఒక తమిళవెబ్ సైట్ తో ఆయన మాట్లాడుతూ, `బోగ‌న్` సినిమా తెలుగు రీమేక్‌ లో న‌టించేందుకు ర‌వితేజ అంగీక‌రించడంతో ఆరు నెలలపాటు క‌ష్ట‌ప‌డి ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌ కు త‌గిన‌ట్టుగా స్క్రిప్టులో మార్పులు చేశానని అన్నాడు. ఇక షూటింగ్ మొద‌లు కావ‌డ‌మే తరువాయి అనుకుంటున్న దశలో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారని, అది తనను బాగా అప్సెట్ చేసిందని చెప్పాడు.

అయితే, ఆయన అలా ఎందుకు చేశారో తనకు తెలియదని, అయితే ఆయన అలా చేయడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఆయన చెప్పారు. అంతా సరే అనుకున్న తరువాత రవితేజ ఇలా చేయడం సరికాదని ఆయన హితవు పలికాడు. 

raviteja
mass maharaja
tamil remake
laxman
bhogan
  • Loading...

More Telugu News