telangana: కల్వర్టు కింద రెండు బాంబులు... బెంబేలెత్తిన గ్రామస్థులు!

  • జయశంకర్ జిల్లాలో ప్రధాన రహదారిలోని కల్వర్టు కింద రెండు బాంబులు
  • బాంబులను చూసి భయపడిన గ్రామస్థులు
  • యాంటీ బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్న పోలీసులు

తెలంగాణలోని ఓ గ్రామంలోని రహదారిలోని కల్వర్టు కింద బయటపడిన రెండు బాంబులను చూసి గ్రామస్థులు బెంబేలెత్తిపోయిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక, మొరివానిగూడెం గ్రామాల మధ్యలోని ప్రధాన రహదారిలో ఉన్న కల్వర్టు కింద రెండు బాంబులు బయటపడ్డాయి.

దీంతో ఈ రోడ్డులో రాకపోకలు నిర్వహించే ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యాంటీ బాంబ్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. ఆ రెండు బాంబులను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రెండు గ్రామాలను కలిపే రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఈ బాంబులను పోలీసులపై దాడి లక్ష్యంగా మావోయిస్టులు అమర్చి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. 

telangana
bombs
police
anti bomb squad
  • Loading...

More Telugu News