nvss prabhakar: ఓలా క్యాబ్ లో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్

  • క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది
  • సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన మంత్రి.. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు
  • క్యాబ్ డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకే క్యాబ్ లో వచ్చా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓలా క్యాబ్ లో వచ్చారు. రామంతపూర్ లోని తన నివాసం నుంచి పాదయాత్రగా బయల్దేరి, అనంతరం క్యాబ్ లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేస్తామంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారని... ఇంతవరకు ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

అందుకే క్యాబ్ లో వస్తూ, క్యాబ్ డ్రైవర్ల సమస్యల గురించి తెలుసుకున్నానని చెప్పారు. క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. క్యాబ్ డ్రైవర్లకు రావాల్సిన కమిషన్లు ఇవ్వకుండా, యాజమాన్యాలు అన్యాయం చేస్తున్నాయని... ప్రశ్నించిన వారిపై పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని అన్నారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

nvss prabhakar
telangana assembly sessions
BJP
  • Loading...

More Telugu News