Jagan: తండ్రికి ఘన నివాళి అర్పించి, ఆశీర్వాదం తీసుకున్న జగన్

  • తండ్రికి నివాళి అర్పించిన జగన్
  • జగన్ వెంట తల్లి, భార్య, చెల్లెలు
  • వైసీపీ కీలక నేతలతో సందడిగా వైయస్ ఘాట్

వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు వెళ్లి ఘన నివాళి అర్పించారు. తన పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుతూ, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల ఉన్నారు.

అంతకుముందే వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, రోజా, లక్ష్మీపార్వతి తదితరులు వైయస్ సమాధి వద్దకు చేరుకున్నారు. వైయస్ సమాధి వద్ద నుంచి జగన్ సభాప్రాంగణానికి వెళ్లారు. కాసేపట్లో ఇడుపులపాయలో జగన్ సభ ప్రారంభం కానుంది. అనంతరం వైసీపీ అధినేత పాదయాత్ర ప్రారంభమవుతుంది. 

Jagan
ys ghat
idupulapaya
ys jagan padayatra
  • Loading...

More Telugu News