samantha: వంట చేశానోచ్...ఎవరికీ ఏమీ కాలేదోచ్!: సమంత సంబరం

  • షూటింగ్ క్యాన్సిల్ కావడంతో వంటగదిలో దూరిన సమంత
  • తొలిసారి వంట చేసి, సంబరపడిన ముద్దుగుమ్మ 
  • ఖాళీ దొరికితే ఇకపై వంటలు నేర్చుకుంటానన్న సమంత

ప్రముఖ సినీ నటి, కొత్త పెళ్లి కూతురు సమంత సంబరపడిపోతోంది. సమంత సంబరానికి కారణం ఉంది. వివాహానికి ముందు తన ప్రియుడు నాగచైతన్యతో వండించుకుని పార్టీలు చేసుకున్న సమంత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను అలరించేది. వివాహానంతరం సమంత తొలిసారి వంటగదిలోకి వెళ్లి వంట చేసి గృహిణి బాధ్యతలు నెరవేర్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంది.

ఈ సందర్భంగా 'వంట చేశానోచ్...ఎవరికీ ఏమీ కాలేదోచ్' అంటూ సంబరపడిపోయింది. షూటింగ్ క్యాన్సిల్ కావడంతో వంటగదిలోకి వెళ్లానని, కూరగాయలు కోయడం దగ్గర్నుంచి వంట చేయడం వరకు అన్ని పనులు తానే చేశానని సమంత తెలిపింది. ఇకపై ఖాళీ దొరికితే వంటలు చేయడం నేర్చుకుంటానని చెప్పింది. వివాహానంతరం బంధువుల కుటుంబాల్లో భోజనాల సందర్భంగా ఆ గృహిణిల బాధ్యతలు చూసి ఆశ్చర్యపోయానని సమంత తెలిపిన సంగతి తెలిసిందే.

samantha
cooking
social media
  • Loading...

More Telugu News