జగన్: నా ప్రజల దీవెనలతో రేపటి నుంచి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెడుతున్నా!: ఫేస్ బుక్ లో వైఎస్ జగన్

  • ఫేస్ బుక్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసిన జగన్
  • నా ఆలోచనలు, పాదయాత్రలోని అనుభవాలను మీతో పంచుకుంటా
  • 'Jagan Speaks' అనే ఈ వీడియో సిరీస్ ను ప్రారంభిస్తున్నా

వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి తన పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘నా ప్రజల దీవెనలతో రేపు, నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుండి ప్రజా సంకల్పయాత్రను మొదలుపెడుతున్నాను. నా ఆలోచనలు, పాదయాత్రలోని అనుభవాలను మీతో పంచుకోవడానికి 'Jagan Speaks' అనే ఈ వీడియో సిరీస్ ను ప్రారంభిస్తున్నాను. బయటి విధంగానే డిజిటల్ మాధ్యమంలో కూడా ఆదరణ, చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను..’ అని పేర్కొన్న జగన్, ఓ వీడియోను పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News