ఉత్తమ్: తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే గిరిజనుల వాటా సాధిస్తాం: టీపీసీసీ ఉత్తమ్

  • గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి
  • ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్
  • 2019లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న ఉత్తమ్
  • గిరిజనులను ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత కాంగ్రెస్ దే: జానా

తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే గిరిజనుల వాటా సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు కీలకపాత్ర పోషించారని, వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను కేసీఆర్ తప్పారని విమర్శించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించలేదని, ఇందిరమ్మ బిల్లులు చెల్లించలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. దేశంలో అత్యధిక గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, తండాలను గ్రామపంచాయతీలను చేయడమే కాదు, వాటికి సరిపడా నిధులు సమకూర్చాలని, దేశంలో గిరిజనులను ముఖ్యమంత్రులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈ సందర్బంగా జానారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News