YSRCP: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు మృతి.. విషాదంలో పార్టీ శ్రేణులు

  • గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జగన్నాయకులు
  • విషాదంలో శ్రీకాకుళం నేతలు
  • నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పలాస మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు (58) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన విశాఖపట్టణంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్వగ్రామం మందసలో నేడు (ఆదివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చాలాకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జగన్నాయకులకు ఆరు నెలల క్రితమే కేర్ వైద్యులు కిడ్నీ మార్చారు. దగ్గరి బంధువు కిడ్నీ మార్చడంతో ఆయన కోలుకుంటారని భావించారు. చికిత్స కోసం ఆయన విశాఖలోనే ఉంటున్నారు. కాగా, ఈనెల 1 తీవ్ర అస్వస్థతకు గురైన జగన్నాయకులు మరోమారు కేర్‌లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. గత నెలలోనే ఆయన తల్లి లక్ష్మమ్మ మృతి చెందారు. జగన్నాయకులు మృతితో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. 

YSRCP
Jagannayakulu
palasa
  • Loading...

More Telugu News