: విభేదాలున్నా.. వివాదం చేయదల్చుకోలేదు: బాలకృష్ణ


నందమూరి కుటుంబంలో విభేదాలున్నా.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయదల్చుకోలేదని సినీనటుడు బాలకృష్ణ అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పడం సంతోషదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. రేపు జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు, బాలయ్య ఈ సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి తమ కుటుంబంలో అందరూ వస్తున్నారని చెప్పారు. ఇక చంద్రబాబుకు ఆహ్వానం అందకపోవడంపై స్పందిస్తూ.. అనుభవం ఎక్కువ కావడంతోనో, లేక, తెలీకో ఇప్పటికి పిలిచారని బాలయ్య ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News