airport: పవర్ బ్యాంకు, మొబైల్ చార్జర్, క్యాలిక్‌లేటర్‌లో డ‌బ్బు త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డ యువ‌కుడు

  • కోల్‌కతా విమానాశ్ర‌యంలో కేటుగాడు
  • 12,100 డాలర్లను అక్ర‌మంగా త‌ర‌లించాల‌ని చూసిన వైనం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోల్‌కతా విమానాశ్ర‌యంలో ఓ కేటుగాడు అతి తెలివి ప్ర‌ద‌ర్శించాడు. పవర్ బ్యాంకు, మొబైల్ చార్జర్, క్యాలిక్‌లేటర్‌లో 12,100 డాలర్లను ఉంచి విదేశాల నుంచి అక్ర‌మంగా తీసుకొచ్చాడు. అయితే, ఆ కేటుగాడిని క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన క‌స్ట‌మ్స్ అధికారులు ఆయా వ‌స్తువుల్లో డాల‌ర్లు ఉన్నాయ‌ని గుర్తించారు. ఆ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌టన‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 

  • Loading...

More Telugu News