rashmi: చీరేక‌దా క‌ట్టుకున్న‌ది.. అందులో అశ్లీల‌త ఏముంది?: యాంక‌ర్‌, సినీన‌టి ర‌ష్మీ

  • గుంటూరు టాకీస్ సినిమా త‌రువాత 'నెక్స్ట్ నువ్వే' సినిమాలో ర‌ష్మీ
  • ట్రైల‌ర్‌లో సింపుల్ డైలాగ్‌ల‌నే చూపించాం: ర‌ష్మీ
  • ఈ సినిమాలో అన్ని ర‌కాల‌ ఎమోష‌న్స్ ఉంటాయి

'గుంటూరు టాకీస్' సినిమాలో న‌టించి కుర్ర‌కారు మ‌తిని పోగొట్టిన యాంక‌ర్‌, సినీన‌టి ర‌ష్మీ కొత్త‌ చిత్రం 'నెక్స్ట్ నువ్వే' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో త‌న పాత్ర గురించి మాట్లాడింది. ఈ సినిమా ట్రైల‌ర్‌లో విన‌ప‌డుతోన్న 'నీకు గ‌డ్డివాము ద‌గ్గ‌ర కుక్క గురించి తెలుసా? అది తిన‌దు ఇంకొక‌రిని తిన‌నివ్వ‌దు' అనే డైలాగుని చెబుతూ ఒల‌క‌బోసిన సోయ‌గాలపై విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యంపై రష్మీ స్పందించింది.

ట్రైల‌ర్‌లో సింపుల్ డైలాగ్‌ల‌నే చూపించామ‌ని చెప్పింది. 'అందులో చీరేక‌దా క‌ట్టుకున్నాను?
అందులో అశ్లీల‌త ఏముంది?' అంటూ అడిగింది. ఈ సినిమాలో అన్ని ర‌కాల‌ ఎమోష‌న్స్ ఉంటాయ‌ని ర‌ష్మీ చెప్పింది. గుంటూరు టాకీస్ త‌రువాత చాలా గ్యాప్ వ‌చ్చిందని తెలిపింది. ఆ సినిమా త‌రువాత త‌న‌కు న‌చ్చిన క‌థ, స‌రైన బ్యాన‌ర్ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News