Anushka Sharma: అనుష్క శ‌ర్మ త‌న అదృష్ట దేవ‌తంటున్న విరాట్ కోహ్లీ!

  • నాలుగేళ్ల‌లో త‌న‌ను చాలా మార్చేసింద‌ని వ్యాఖ్య‌
  • ఓపిగ్గా ఉండ‌టం అనుష్కే నేర్పింద‌న్న క్రికెట‌ర్‌
  • ఓ టాక్ షోలో వెల్ల‌డించిన విరాట్‌

త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌ను ప్రియుడు విరాట్ కోహ్లీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఓ టాక్ షోలో ఆయ‌న మాట్లాడుతూ అనుష్క శ‌ర్మ త‌న అదృష్ట దేవ‌త అని కొనియాడాడు. `నేను నా అదృష్ట దేవ‌త‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. మీరు చూస్తూనే ఉన్నారు.. గ‌త నాలుగేళ్లుగా నాలో చాలా మార్పు వ‌చ్చింది. అంత‌కుముందు నేను జ్ఞానం లేకుండా ప్ర‌వ‌ర్తించే వాడిని. కానీ ఆమె నా జీవితంలోకి వ‌చ్చాక ఓపిగ్గా ఎలా ఉండాలో నేర్పించింది. ఇంకా చాలా విష‌యాల‌ను ఆమె నాకు నేర్పించింది. నా జీవితంలో ఎలా గ‌డ‌పాలో ఆమె ఓ దారి చూపించింది` అని విరాట్ అన్నాడు.

ఆట‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌న మెరుగ్గా లేని స‌మ‌యాల్లో అనుష్క త‌న‌కు వెన్నుద‌న్నుగా నిల‌బ‌డింద‌ని విరాట్ పేర్కొన్నాడు. `2014 ఇంగ్లండ్ పర్యటన స‌మ‌యంలో ఆమె న‌న్ను మోటివేట్ చేసింది. నా ప‌రిస్థితిని అర్థం చేసుకుంది. ఆమె కార‌ణంగానే నేను ముందుకు వెళ్ల‌గ‌లిగాను. అంతేకాకుండా మా ఇద్ద‌రి గురించి జ‌నాలు చాలా మాట్లాడారు. వాటిని ఎలా క‌ట్ట‌డి చేయాలో ఆమె నేర్పించింది` అని అన్నాడు.

అలాగే త‌మ మ‌ధ్య రిలేషన్‌షిప్ గురించి బ‌హిరంగంగా చెప్ప‌డానికి స‌హాయం చేసిందెవ‌ర‌ని అడ‌గ్గా... విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని జ‌హీర్ ఖాన్ త‌న‌కు స‌ల‌హా ఇచ్చిన‌ట్లు విరాట్ చెప్పాడు. ఈ విష‌యాన్ని దాచి పెట్ట‌డం వ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంద‌ని జ‌హీర్ హిత‌బోధ చేసిన‌ట్లు విరాట్ తెలిపాడు.

  • Loading...

More Telugu News