Pawan Kalyan: త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల కానున్న‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమాలోని తొలిపాట!

  • ఈ నెల 7న‌ విడుదల
  • సినిమా టైటిల్‌ను కూడా ప్ర‌క‌టిస్తార‌ని అంచ‌నా
  • ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ ఈ సినిమాపై భారీ అంచనాలు

సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. ప‌వన్ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమాలోని తొలి పాటను ఈ నెల 7న‌ విడుదల చేయనున్నారు. ఆ రోజున త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టినరోజు కావడంతో ఈ పాట‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ తెలిపింది. అలాగే న‌వంబ‌ర్ 7న ఆ సినిమా టైటిల్‌ను కూడా ప్ర‌క‌టిస్తార‌ని కూడా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే పేరు పెడ‌తార‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జ‌వ‌వ‌రి 10న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News