Virat Kohli: ఆటపై అభిరుచి పోయిన మరుసటి రోజే క్రికెట్‌ ఆడటం మానేస్తా: విరాట్ కోహ్లీ

  • రేపు కోహ్లీ 29వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూ
  • విజయాలు సాధించ‌డ‌మే నాకు ప్రేరణ
  • శరీరం సహకరించినన్ని రోజులు ఆటను ఆస్వాదిస్తా
  • వెన్నుతట్టి ప్రోత్సహించే వారుంటే ఓట‌ముల‌ భారం తగ్గుతుంది

విజయాలు సాధించ‌డ‌మే త‌నకు ప్రేరణ అని,ఆటపై అభిరుచి పోయిన మరుసటి రోజే క్రికెట్‌ ఆడటం మానేస్తాన‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. రేపు తాను 29వ‌ పుట్టిన రోజు జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. త‌న‌ శరీరం సహకరించినన్ని రోజులు ఆటను ఆస్వాదిస్తాన‌ని అన్నాడు. అలా లేనప్పుడు తానిక క్రికెట్‌లో ఉండ‌బోన‌ని చెప్పాడు. ఆటపై అనురక్తి లేకుండా తాను నిద్రలేచిన రోజులు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. అయితే, పట్టుదలతో శ్రద్ధగా ఆడి దాన్ని అధిగమించానని తెలిపాడు.

వెన్నుతట్టి ప్రోత్సహించే వారుంటే ఓట‌ముల‌ భారం తగ్గుతుందని, మళ్లీ విజ‌యం సాధించేవ‌రకు ప్రయత్నించాలని అనిపిస్తుందని విరాట్ కోహ్లీ తెలిపాడు. క్రీడాకారులకు ఇది ఎంతో అవసరమ‌ని ఆయ‌న పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ సార‌థ్యంలో, మెరుగైన ఆట‌తీరుతో టీమిండియా విజ‌యాల‌తో దూసుకుపోతోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News