whether: లంబసింగిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

  • తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  •  మోదకొండమ్మ పాదాలు, లంబసింగిల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు
  •  ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నమోదవుతున్న 13 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణల్లోని వివిధ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతుండగా, హైదరాబాదు, రామగుండం, వరంగల్ తదితర జిల్లాల్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థితికి చేరుకుంటున్నాయి.

మోదకొండమ్మపాదాలు, లంబసింగిల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అరకు, పాడేరు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖపట్టణంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మన్యంవాసులు చలిపులికి బెంబేలెత్తిపోతున్నారు. కాగా, అరకు, పాడేరు ప్రాంతాల్లో వలిసె పూలు పర్యాటకులను అలరిస్తుండగా, లంబసింగిలో వాతావరణంలో మార్పులను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News