indian air force: వైమానిక దళం అమ్ములపొదిలో మరో అస్త్రం... 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం తునాతునకలు! కావాల్సిందే

  • గ్లైడ్ బాంబును విజయవంతంగా పరీక్షించిన వాయుసేన
  • ఒడిశాలోని చండీపూర్‌ లో విమానం నుంచి ప్రయోగం
  • మూడు విభిన్న పరిస్థితుల్లో ప్రయోగం... మూడూ సక్సెస్

భారత వాయుసేన అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. తేలికపాటి గ్లైడ్ బాంబును ఒడిశాలోని చండీపూర్‌ లో విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. నేవిగేషన్‌ సిస్టం సాయంతో 70 కి.మీ.పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో తునాతునకలు చేస్తుందని డీఆర్డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.

స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ ఫీల్డ్‌ వెపన్‌ గా పిలుచుకునే ఈ గ్లైడ్‌ బాంబును... మూడు విభిన్న పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఎయిర్‌ ఫోర్స్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలెప్ మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), రీసెర్చ్‌ సెంటర్‌ ఇమరాత్‌ (ఆర్‌సీఐ) సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. త్వరలో ఈ బాంబులను ఆర్మ్ డ్ ఫోర్సెస్ కు అందిస్తామని డీఆర్డీవో ఛైర్మన్ తెలిపారు.

indian air force
glide bomb
drdo
rci
  • Error fetching data: Network response was not ok

More Telugu News