గౌతమీ: మా అమ్మాయికి నేను నేర్పించిన మొదటి మాట ‘నో’: సినీ నటి గౌతమి
- ‘వద్దు’ అని చెప్పడం ముఖ్యంగా ఆడవాళ్లకు రాదు
- అలా చెప్పలేక నా జీవితంలో చాలా ఇబ్బంది పడ్డా
- నా చుట్టుపక్కల వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశా: గౌతమి
తన కూతురు సుబ్బులక్ష్మికి తాను మొట్టమొదటగా నేర్పించిన మాట ‘నో’ అని ప్రముఖ సినీ నటి గౌతమి చెప్పింది. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "మా అమ్మాయి మాటలు నేర్చుకోవడం, పలకడం మొదలుపెట్టే ముందు నేను నేర్పించిన పదం ‘నో’. ‘వద్దు’ అనే మాట చెప్పడం ముఖ్యంగా ఆడవాళ్లకు రాదు. ‘నో ’ అని చెప్పలేకపోవడంతో నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. అదేవిధంగా, ‘నో’ అని చెప్పడం చేతకాక నా చుట్టుపక్కలవాళ్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశా! ఈరోజున నా కూతురికి ఏదైనా ఇష్టం లేకపోతే, చాలా చక్కగా, అందంగా ‘నో’ అని చెబుతుంది" అని గౌతమి పేర్కొంది.