kidnap: రైల్వే స్టేష‌న్‌లో త‌ల్లి ప‌క్క‌న‌ నిద్రిస్తోన్న చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండ‌గుడు.. వీడియో విడుద‌ల‌!

  • గోవాలోని మార్గావ్ రైల్వేస్టేష‌న్‌లో ఘ‌ట‌న
  • బ్యాగ్ కొట్టేసి, అలాగే మూడేళ్ల‌ చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండ‌గుడు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

గోవాలోని మార్గావ్ రైల్వేస్టేష‌న్‌లో త‌ల్లి ప‌క్క‌న‌ నిద్రిస్తోన్న మూడేళ్ల‌ చిన్నారిని ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఎత్తుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. త‌ల‌కి ఆకుప‌చ్చ‌ని కండువాని క‌ప్పుకుని వ‌చ్చిన ఓ వ్య‌క్తి ప్లాట్ ఫామ్‌పై నిద్రిస్తోన్న ఓ కుటుంబాన్ని చూశాడు. అంద‌రూ గాఢ నిద్ర‌లో ఉండ‌గా వారి మ‌ధ్య‌లో ఉన్న ఓ బ్యాగుని చోరీ చేశాడు.

అలాగే చిన్నారిని ఎత్తుకుని ఓ ట‌వ‌ల్ క‌ప్పి తీసుకెళ్లాడు. కొద్ది సేప‌టి త‌రువాత ఆ కుటుంబంలోని ఓ అమ్మాయికి మెలుకువ వ‌చ్చింది. త‌న చెల్లి అక్క‌డ లేని విష‌యాన్ని గుర్తించింది. వెంట‌నే త‌న త‌ల్లిదండ్రుల‌ను లేపి, ఈ విష‌యాన్ని చెప్పింది. వారంతా క‌లిసి రైల్వే స్టేష‌న్ ప‌రిస‌రాల్లో వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దుండగుడిని గాలిస్తున్నారు.   

  • Loading...

More Telugu News