rajasekhar: రాజశేఖర్ చెప్పింది నిజమే .. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు : 'గరుడవేగ' గురించి పబ్లిక్ టాక్

  • ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు 'గరుడవేగ'
  • యాక్షన్ సీన్స్ లో మెప్పించిన రాజశేఖర్ 
  • లుక్స్ పరంగాను ఆయనకి మంచి మార్కులు  
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న కథా కథనాలు

రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'గరుడ వేగ' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందనీ .. హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగా ఉంటుందని ప్రమోషన్స్ లో రాజశేఖర్ చెప్పారు. గత చిత్రాల్లో మాదిరిగా ఎక్కువ ఎమోషన్ కాకుండా .. చాలా సహజంగా ఈ సినిమాలో నటించానని అన్నారు. కథ .. కథనం ఆసక్తికరంగా కొనసాగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తాయని చెప్పారు.

రాజశేఖర్ చెప్పింది నిజమే .. ఆయన చెప్పినట్టుగానే ఉందని ఈ సినిమా చూసినవాళ్లు అంటున్నారు. లుక్స్ పరంగా చూసుకుంటే గత చిత్రాల్లో కన్నా రాజశేఖర్ ఈ సినిమాలో బాగున్నాడని అంటున్నారు. ఇక ఎప్పటిలానే యాక్షన్ సీన్స్ లో మెప్పిస్తూ ..  పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు బాగా పరిశోధించి ఈ కథను సిద్ధం చేసుకోవడం వలన కంటెంట్ కనెక్ట్ అవుతోందనీ, నిజంగానే ఈ సినిమా రాజశేఖర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.   

  • Loading...

More Telugu News