praveen sattharu: ఖర్చుపై సందీప్ కిషన్ నాతో గొడవపడ్డాడు.. తన వాటా తనకిచ్చేసి పంపేశాను! : దర్శకుడు ప్రవీణ్ సత్తారు

  • ఆ సినిమాకి ఒక నిర్మాతగా సందీప్ కిషన్ వున్నాడు 
  • బడ్జెట్ పెరిగిపోతుందంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు 
  • ఆయన వాటా వెనక్కి ఇచ్చేశాను 
  • ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాం  

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'గరుడ వేగ' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐ డ్రీమ్స్ కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఓ ప్రశ్నకి సమాధానంగా ..  సందీప్ కిషన్ కి.. తనకి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పాడు. "రొటీన్ లవ్ స్టోరీ'కి నేను దర్శకుడిగా వున్నాను .. సందీప్ కిషన్ .. ఆయన ఫ్రెండ్ నిర్మాతలుగా వున్నారు. చివరి నిమిషంలో ఆ ఫ్రెండ్ పక్కకి తప్పుకోవడంతో, ఆ బాధ్యతను నేను స్వీకరించడానికి సిద్ధమయ్యాను" అని అన్నాడు.

"ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను ఉత్తరాఖండ్ లో చిత్రీకరించాం. షూటింగ్ కోసం బయటికి వెళ్లినప్పుడు కొంత ఖర్చు పెరగడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా అక్కడ అదనంగా ఓ 15 లక్షలు ఖర్చు చేయవలసి వచ్చింది. బడ్జెట్ ఎక్కువైపోతోందంటూ సందీప్ కిషన్ అసహనాన్ని వ్యక్తం చేయగా .. నేను సర్ది చెప్పాను. అయినా ఆయన వినిపించుకోకపోవడంతో మాటా మాట పెరిగింది .. దాంతో ఆయన వాటా వెనక్కి ఇచ్చేశాను. ఇప్పుడు ఇద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.         

praveen sattharu
  • Loading...

More Telugu News