gas cylinder: సిలిండర్ పేలడంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మృతి!

  • బెంగళూరులో ఘటన
  • మృతులిద్దరూ అన్నదమ్ములే
  • చావుబతుకుల్లో అన్న భార్య

బెంగళూరులోని బనశంకరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరస్వామిరెడ్డి లేఔట్ లో నివాసం ఉంటున్న హరేంద్ర (34), నరేంద్ర (27) ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం వీరి ఇంటిలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరితో పాటు నరేంద్ర భార్య శిల్ప, అతని కుమార్తె ఆర్యలు తీవ్రంగా గాయపడ్డారు.

అప్పటి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. శిల్ప చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్యను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

gas cylinder
gas cylinder explosion
  • Loading...

More Telugu News