narayana college: నారాయణ ఆడియో టేపుల వ్యవహారంలో మరో ట్విస్ట్... డబ్బు తీసుకుని అలా మాట్లాడానంటున్న సరిత!

  • మాట మార్చిన సరితా అగర్వాల్
  • లైంగికంగా వేధించి బెదిరించారు
  • అలా మాట్లాడకుంటే అంతు చూస్తామన్నారు
  • రూ. 2 లక్షలు ఇచ్చారన్న సరితా అగర్వాల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనం కలిగిస్తున్న నారాయణ కళాశాల ఉద్యోగుల ఆడియో టేపులో, మహిళ గొంతుగా భావిస్తున్న సరితా అగర్వాల్ తెరపైకి వచ్చారు. తాజాగా, ఆమె ఈ వ్యవహారానికి సరికొత్త ట్విస్ట్ ఇస్తూ, తనకు రూ. 2 లక్షలు ఇచ్చి అలా మాట్లాడించారని, ఆ స్క్రిప్ట్ వేరొకరిదని ఆరోపించారు. తాను డబ్బు తీసుకుని వారు రాసిచ్చింది మాట్లాడానని, ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పానని అన్నారు. తనను లైంగికంగా, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు.

అలా మాట్లాడకుంటే పిల్లలను కూడా బతకనీయబోమని హెచ్చరించారని, ఒత్తిడిలో తాను అలా మాట్లాడానని సరిత వెల్లడించారు. అయితే, ఎవరు అలా మాట్లాడించారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. తనకు ప్రాణభయం ఉందని సరిత ఆందోళన వ్యక్తం చేశారు. తాను పదేళ్లుగా నారాయణలో పనిచేస్తున్నానని, ఇంత మానసిక వేదనను అనుభవిస్తానని అనుకోలేదని వాపోయారు.

narayana college
principal
ramantapur
sarita
  • Loading...

More Telugu News