donald trump: ట్విట్టర్ నుంచి ట్రంప్ అవుట్?... నెటిజన్ల ఆందోళన!
- 11 నిమిషాలపాటు ట్రంప్ ఖాతా స్తంభన
- ఆందోళన చెందిన ట్విట్టర్ ఫాలోయర్స్
- సిబ్బంది పొరపాటు కారణంగా ట్రంప్ అకౌంట్ నిలిచిందని గుర్తించిన అధికారులు
- పొరపాటుపై ట్విట్టర్ విచారణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా మూసేసి, ట్విట్టర్ నుంచి నిష్క్రమించారా? అంటూ నెటిజన్లు ఆరాతీయడం ఆరంభించారు. నిన్న సాయంత్రం @realdonald trump అకౌంట్ కు మెసేజ్ చేస్తే.. ట్విటర్ నుంచి 'ఈ పేజీ ఇప్పుడు పనిచేయడం లేదు' అనే రిప్లయ్ నెటిజన్లకు దర్శనమిచ్చింది. దీంతో ట్రంప్ ట్విట్టర్ నుంచి వెళ్లిపోయారని అంతా భావించారు. ఇది వైరల్ కావడంతో ట్రంప్ ట్విట్టర్ నుంచి నిష్క్రమించారా? అంటూ మరికొందరు ఆసక్తికరంగా దానిని నిర్ధారించుకోవడం ప్రారంభించారు.
మరో 11 నిమిషాల తరువాత ట్రంప్ ఖాతా ఓపెన్ కావడంతో నెటిజన్లు ఎందుకలా జరిగిందని ఆరాతీయడం ప్రారంభించారు. ట్విట్టర్ సిబ్బంది పొరపాటు కారణంగా ట్రంప్ ఖాతా 11 నిమిషాల పాటు నిలిచిపోయిందని తేలింది. పొరపాటును గుర్తించిన ట్విట్టర్ సిబ్బంది, వెంటనే ఆయన ఖాతాను పునరుద్ధరించారు. అనంతరం దీనిపై విచారణ ప్రారంభించారు. కాగా, ట్విట్టర్ లో ట్రంప్ కు 41.7 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. దీంతో ట్విట్టర్ లో ఆయన ఖాతా కనబడకపోవడంతో కలకలం రేగింది.