vallabhaneni vamsi: చంద్రబాబును కలసిన వల్లభనేని వంశీ

  • సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ
  • డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయకుండా చూడాలని విన్నపం
  • ఫ్యాక్టరీ మూతపడితే రైతులు ఇబ్బందులు పడతారన్న వంశీ

ముఖ్యమంత్రి చంద్రబాబును టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఈ ఉదయం డెల్టా షుగర్ ఫ్యాక్టరీ రైతులతో కలసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే, రైతులను క్యాంపు కార్యాలయం లోనికి అనుమతించలేదు. దీంతో, వంశీ మాత్రమే చంద్రబాబును కలసి మాట్లాడారు.

డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేస్తే చెరకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని... చెరకును హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరుకు తరలించాల్సి ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు. ఈ కారణం వల్ల 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని... దీంతో, రవాణా ఖర్చులు అధికమవుతాయని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని, ఫ్యాక్టరీని మూసివేయకుండా చూడాలని సీఎంకు విన్నవించారు.  

vallabhaneni vamsi
Telugudesam mla
chandrababu
ap cm
delta sugar factory
  • Loading...

More Telugu News