sharwanand: శర్వానంద్ కి కొత్తే .. ఆయన సరసన ఇద్దరు హీరోయిన్స్!

  • సుధీర్ వర్మతో శర్వానంద్ తాజా చిత్రం
  • మాఫియా డాన్ గా ఆయన పాత్ర 
  • ఒక కథానాయికగా షాలినీ పాండే 
  • మరో కథానాయికగా నివేదా థామస్  

వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ .. వరుస విజయాలను అందుకుంటూ శర్వానంద్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన సుధీరవర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ చేయనున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఓ సామాన్య యువకుడు మాఫియా డాన్ గా ఎలా మారాడనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది.

ఈ సినిమాలో యంగ్ లుక్ తోను .. మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గాను శర్వానంద్ కనిపించనున్నాడు. శర్వానంద్ ఇంతవరకూ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన దాఖలాలు కనిపించవు. కానీ ఈ సినిమా కోసం ఆయన ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇప్పటికే షాలినీ పాండేను ఒక కథానాయికగా తీసుకోగా .. మరో కథానాయికగా నివేదా థామస్ ను సంప్రదిస్తున్నారు. దాదాపు ఆమె ఖరారు కావొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది     

  • Loading...

More Telugu News