ఉత్తమ్: ఉత్తమ్, జానారెడ్డి మధ్య సమన్వయం లేదనిపిస్తోంది: కొప్పుల ఈశ్వర్

  • ఉత్తమ్ ఒకటి మాట్లాడితే, జానా మరోటి మాట్లాడుతున్నారు
  • ప్రతి చిన్న విషయాన్ని ‘కాంగ్రెస్’ రాద్ధాంతం చేస్తోంది
  •  ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే వారి మధ్య సమన్వయం లేదనిపిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి చిన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని, డిప్యూటీ స్పీకర్ పై ఉత్తమ్, జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఉత్తమ్ ఒకటి మాట్లాడితే, జానా మరోటి మాట్లాడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ట్రిక్ లు, తెలంగాణ రాష్ట్రంలో పని చేయవనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని అన్నారు.

  • Loading...

More Telugu News