kcr: ఉచిత విద్యుత్‌ను ప్రారంభించింది వైఎస్సారే!: ముఖ్యమంత్రి కేసీఆర్
- గత ప్రభుత్వాలు ప్రారంభిస్తే మేము సమర్థవంతంగా కొనసాగిస్తున్నాం
- అప్పట్లో విద్యుత్ కోతలు ఉండేవి
- ఇప్పుడు ఉంటున్నాయా?
ఉచిత విద్యుత్ పథకాన్ని తామే ప్రారంభించామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని, ప్రారంభిస్తే సరిపోతుందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఉచిత విద్యుత్తుని ప్రారంభించలేదని తాము అన్నామా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ని ప్రారంభించింది వైఎస్సారేనని వ్యాఖ్యానించారు. కానీ దాన్ని కొనసాగిస్తోంది తామేనని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరెంటు కోతలు లేవని చెప్పారు.
అప్పట్లో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఎన్నో కష్టాలు పడేవారని అన్నారు. రుణమాఫీ కాలేదని, వడ్డీభారం ఉందని తమకు ఎవ్వరూ ఫిర్యాదులు చేయలేదని అన్నారు. ఇప్పుడు విద్యుత్ కోత అనే మాట వినపడుతోందా? అని ప్రశ్నించారు. తాము రూ.5 వేల కోట్లతో ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.