కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి: టీటీడీపీకి మ‌రో షాక్‌.. సీఎం కేసీఆర్‌తో చర్చించిన టీడీపీ నేత కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి

  • మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని క‌లిసిన టీడీపీ నేత‌ కంచర్ల భూపాల్‌రెడ్డి
  • కంచర్ల భూపాల్‌రెడ్డిని కేసీఆర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లిన జ‌గ‌దీశ్ రెడ్డి
  • టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతార‌ని ప్ర‌చారం

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప‌లువురు టీటీడీపీ నేత‌లు క‌లిశారు. కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని క‌లిసిన టీడీపీ నేత‌ కంచర్ల భూపాల్‌రెడ్డి, అత‌డి సోద‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కాసేపు చ‌ర్చించారు. అనంత‌రం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న కేసీఆర్ వ‌ద్ద‌కు వారిని తీసుకొచ్చారు.

కంచర్ల భూపాల్‌రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇటీవ‌లే ఈయన పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భూపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  

  • Loading...

More Telugu News