*మెహబూబా’: ‘‘మెహబూబా’ సెట్స్ లో క్యూటీతో ’ అంటూ నటి చార్మి పోస్ట్!

  • హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న ‘మెహబూబా’ షూటింగ్
  • సెట్స్ లో జడల బర్రెతో కలిసి ఉన్న చార్మి
  • ఫొటోను పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ

తనయుడు ఆకాశ్ పూరీతో పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ‘మెహబూబా’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. అక్కడి పర్వతాలపై గడ్డ కట్టే చలిలో షూటింగ్ చేస్తున్నామంటూ ‘మెహబూబా’ చిత్ర యూనిట్ ఓ వీడియోను ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, ఈ లొకేషన్లో దిగిన ఓ ఫొటోను నటి చార్మీ పోస్ట్ చేసింది. ‘మెహబూబా’ సెట్స్ లో క్యూటీతో’ అంటూ ఈ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలో ఓ జడల బర్రె, చలి కోటు ధరించిన చార్మీ ఉన్నారు. కాగా, ఆకాశ్ పూరీ సరసన ఈ చిత్రంలో నేహాశెట్టి నటిస్తోంది. మంగళూరు మోడల్ అయిన నేహాశెట్టి టాలీవుడ్ కు హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతోంది.

  • Loading...

More Telugu News